Ninnu Chuse Anandamlo

Album cover art for "Ninnu Chuse Anandamlo" by Anirudh Ravichander & Nani (Telugu Actor) & Priyanka Arul Mohan

Anirudh Ravichander & Nani (Telugu Actor) & Priyanka Arul Mohan - Pop, Soundtrack

Ninnu Chuse Anandamlo

0 Plays

Duration: 4:53

View Album

Lyrics

Language:

కథ రాయడం మొదలు కాక ముందు అపుడే ఎలాంటి మలుపో కల దేనికో తెలుసుకోక ముందు అపుడే ఇదేమి తలపో నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే నిను తాకే ఆరాటంలో నను నేనే వదిలేశాను కదే అరె భారమెంత నువు మోపినా మనసు తేలికౌతు ఉందే నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే కథ రాయడం మొదలు కాక ముందు అపుడే ఎలాంటి మలుపో అణువణువున ఒణుకు రేగినది కనబడదది కనులకే అడుగడుగున అడుగుతోంది మది వినబడదది చెవులకే మెదడుకి పది మెలికలేసినది తెలియనిదిది తెలివికే ఇదివరకెరుగనిది ఏమిటిది నిదరయినది నిదరకే తడవ తడవ గొడవాడినా తగని తగువు పడినా విడిగ విడిగ విసిగించినా విడని ముడులు పడెనా నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే నిను తాకే ఆరాటంలో నను నేనే వదిలేశాను కదే అరె భారమెంత నువు మోపినా మనసు తేలికౌతు ఉందే నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే కథ రాయడం మొదలు కాక ముందు అపుడే ఎలాంటి మలుపో ఒకటొకటిగ పనులు పంచుకొని పెరిగిన మన చనువుని సులువుగ చులకనగ చూడకని పలికెను ప్రతి క్షణమిలా ఒకటొకటిగ తెరలు తెంచుకొని తరిగిన మన వెలితిని పొరబడి నువు మరల పెంచకని అరిచెను ప్రతి కణమిలా వెతికి వెతికి బతిమాలినా గతము తిరగబడదే వెనక వెనక అణిచేసినా నిజము మరుగుపడదే నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే నిను తాకే ఆరాటంలో నను నేనే వదిలేశాను కదే అరె భారమెంత నువు మోపినా మనసు తేలికౌతు ఉందే నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే కథ రాయడం మొదలు కాక ముందు అపుడే ఎలాంటి మలుపో

Rate this song

Rate this song

0/5.0 - 0 Ratings

5
0.0% (0)
4
0.0% (0)
3
0.0% (0)
2
0.0% (0)
1
0.0% (0)

Loading comments...

Credits

Writers
  • Anantha Sriram